Follow by Email

బుధవారం 30 నవంబర్ 2011

         ఇప్పటి సినిమా  పాటలు
     ఇందాక ఇతర బ్లాగులు చదువుతుంటే 'జంబలకిడిపంబా లో మై తెలుగు వాడు హై టపా కనిపించింది. అది చదువుతున్నప్పుడు నెను డి.ఇడి చదివేటప్పుడు మా తెలుగు లెక్చరర్  కి నాకు మధ్య జరిగిన సంభాషణ గుర్తుకొచ్చింది. దానిని మీతో పంచుకోవాలనిపించి ఇక్కడ రాస్తున్నా...
         ప్రస్తుతం తెలుగు సినిమాలలో వస్తున్న పాటలు ఎంత  అధ్వాన్నంగా ఉన్నాయో చెబుతూ ఉదాహరణకు పసివాడి ప్రాణం సినిమాలోని కాశ్మీరు లోయలో కన్యాకుమారిలో పాటగురించి చెప్పాడు. అందులో చరణం లో ఓ చోట పొగరాని కుంపట్లు రగిలించి నాడే అన్న వాక్యం ఆలోచిస్తే ఎంత చండాలంగా ఉంటుంది అన్నాడు.. అందుకు నేను అది నిజమే సార్ కాని ఇప్పటి  సినిమాల్లో అయితే మనకి ఆలోచించాల్సిన కష్టం  కూడా లేకుండా దైరెక్ట్‌గా బూతుల్నే  రాసేస్తున్నారు సార్ అన్నాను.
నేను విజిలేస్తే ఆంధ్రా షోడాబుడ్డి పాటనే తీసుకుంటే మల్లీ ఆ పాటలో బూతులకోసం వెతకక్కరలేదు.
ప్రత్యేకించి కొందరిని ఉద్దేశించి నెను ఈమాటలు అనడంలేదు. దాదాపుగా అన్ని పాటలు ఇలాగే ఉంటున్నాయి.  మరి మీరేమంటారు....

మంగళవారం 29 నవంబర్ 2011

అందరికి నమస్కారం,
          ఇది నా మొదటి బ్లాగు. దాదాపు గత కొన్ని నెలలుగా ఇతర బ్లాగులను చదువుతున్నాను. వాటి ప్రేరణతో నాకు  బ్లాగు ప్రారంభించాలనిపించింది. అందుకోసమే ఈ ప్రయత్నం. మీకు ఎక్కువ విసుగు కలగకుండా, వీలైనంతవరకు మిమ్మల్ని ఉత్సాహపరచడానికి ప్రయత్నిస్తాను. నా ఈ ప్రయత్నాన్ని మీరు అమోదిస్తారని ఆశిస్తూ..........


                                                                                                                                          మీ 
                                                                                                                                         శరం.