ఏదో రాద్దామని పెన్ను తీసుకున్నా
కానీ అది కదలక మోరాయించింది
"ఏమైంది నీకు?" అన్నా,
బదులుగా
"ఏంటి నీవు రాస్తోంది?"
"నా ప్రియురాలు గురించి"
"అహ........హ.........హ....." నవ్వింది
"ఎందుకలా నవ్వుతావు?"
"మరేం చెయ్యను ! ? "
అప్పుడర్థమయింది నాకు
నేను చేసుకుంటున్న మోసం.........
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి