11, అక్టోబర్ 2012, గురువారం

HELPING HAND FOR VISUALLY CHALLENGED STUDENTS

               "సర్వేంద్రియానాం నయనం ప్రధానం" ఈ సూక్తి వందల సంవత్సరాలుగా మనం వింటున్నది.  వ్యక్తి తన జీవితాన్ని సాఫీగా గడపాలంటే కళ్ళ ప్రాధాన్యత ఎంతో ఉంది.ఈ విషయాన్ని మన పెద్దలు వందల సంవత్సరాల క్రితమే తెలియచేశారు.  మనకు ఈ విషయం ఇంకా బాగా అర్థంకావాలంటే ఓ పదిహేను నిమిషాలు మనం కళ్ళు మూసుకొని మన దైనందిన కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నించి చూస్తే వాటి ప్రాధాన్యం మనకు "కనిపిస్తుంది".     మనలోని కొద్దిమంది దురదృష్టవశాత్తో, పుట్టుకతోనో కళ్ళు పోగొట్టుకొని అంధులుగా మారారు. మరి అలాంటి వ్యక్తులకు తమ దైనందిన కార్యక్రమాలు నిర్వర్తించుకోవడం ఎంత దుర్లభమో ఒకసారి ఆలోచించండి.    ఇదంతా ఒక ఎత్తు ఐతే తమ దినచర్య నిర్వర్తించుకుంటూ. అనేక కష్టనష్టాలకోర్చి, తమ వైకల్యాన్ని అధిగమించి, తాము ఎంచుకున్న రంగంలో రాణించడానికి కృషిచేసేవారు ఉన్నారు. ఇలా తమ వైకల్యాన్ని ఒక సవాల్ గా తీసుకొని తమ ప్రత్యేకతలు చాటడానికి ప్రయత్నిస్తున్న ధీరులకు మావంతు సహాయంగా చేయందించడానికి ఏర్పాటైన సంస్థ " Vision Through Ears Group. "   Visually challenged students కోసం . audio books ని రూపొందిచడం మా సంస్థ ప్రధానోద్దేశం.  ప్రాథమిక పాఠశాల స్థాయి మొదలుకొని విశ్వ విద్యాలయ స్థాయి వరకు వివిధ దశలలో విద్యను అభ్యసిస్తున్న వారికి, వివిధ పోటీ పరీక్షల కోసం సన్నద్దం అవుతున్న వారికి, ఉపాధ్యయ వృత్తిలో ఉన్నవారికి ఇలా వివిధ దశలలో పుస్తకాలను చదవడం అత్యావశ్యకంగా ఉన్న వారందరికి వారికి అవసరమైన  పుస్తకాలను audio books గా మార్చి వారికి అందజేస్తున్నాం.  ఇక్కడ మరీ ప్రత్యేకంగా చెప్పు కోవాల్సిన విషయం మన ఆంధ్ర రాష్త్రంలోని ఎకైక 'current affairs audio magazine'  మా సంస్థ నుండి వెలువడుతోంది. "విహంగం audio book library" ని కుడా మేము నడుపుతున్నాము.  ఇందులో registration చేసుకున్నవారికి సి.డి లను దాదాపు ఉచితంగా అందజేస్తున్నాము.  ఇది సంక్షిప్తంగా మా సంస్థ గురింది.     
                  
              ఇక్కడ ఖచ్చితంగా ప్రస్తావించాల్సిన వ్య (శ) క్తి శ్రీ ఉమామహేశ్వర రావు గారు.  ఈ సంస్థకు ఏకైక మూలస్తంభం, కర్త, కర్మ, క్రియ అన్నీ తానై తన వినూత్న ఆలోచనలతో సేవలందచేయడంలో సంస్థను పరుగులెత్తిస్తోన్న వ్యక్తి .  ఇవన్నీ అతిశయోక్తి కోసం నేను ఇక్కడ రాయడం లేదు.  ఆయన గూర్చి నేను  ఇక్కడ రాసిన ప్రతివాక్యం అక్షర సత్యం.  ఇది ద్రువపరుచుకోవడానికి,  వృత్తి రీత్యా ఊపిరి సలపని పనులతొ సతమతమవుతున్నా ప్రతిరోజు కనీసం గంట పాటు ఆయినా book recording చేయనిదే నిద్రకుపక్రమించని ఆయన పట్టుదల గమనిస్తే చాలు నేను రాసిన దానిలోని వాస్తవ శాతం మీకు అవగతమవుతుంది.  ఇలా ఆయన పూర్తి అంకితభావంతో గత 3 సంవత్సరాలనుంచి పనిచేస్తున్నారు.  వీరు అందిస్తోన్న సేవల గురించి  ఈ మధ్యన "ఈనాడు" దిన పత్రిక లో కూదా రాయడం జరిగింది.




Services we do  :
  •  Current affairs audio magazine.
  • Audio books for all classes ( from primary classes to Post Graduate level).
  • Study material for all competitive exams.  ( especially for Groups, D.S.C., Edcet, DIETcet & P.G cet)

మీ  వంతుగా  :

                    మా వంతుగా మాశాయశక్తులా కృషిచేసి వివిధ  audio books ని రూపొందిస్తున్నాం.  మేం ఆశించే మీవంతు సహాయం, దయచేసి మీ పరిధిలో visually challenged persons ఎవరైనా ఉంటే వారికి మా సంస్థ గురించి తెలియచేసి మా సేవలను వినియోగింసుకునేలా తోడ్పడగలరు.

                    మరొక విన్నపం, మేం తయారు చేసిన audio materialకి సబంధించిన links మా బ్లాగు నందు పొందుపరిచాము.  మీకు వీలయ్యేటట్లు ఐతే వాటిని C.D. లో కానీ, memory card లో కాని copy చేసి వారికి అందజేయగలరు.

             మా బ్లాగ్ www.visionthroughears.wordpress.com




           
       


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి