ఆమె కనులలో కాటుకై కరగాలని,
ఆమె అధరాలపై ధరహాసమై నిలవాలని,
అమె మేను పై స్వేద బిందువై మెరవాలని,
కలలు కన్నా,
మత్తెక్కించె మల్లెల పరిమళమై
ఆమె సంపెంగ నాసికను చేరాలనుకున్నా
సంగీత సాహిత్యాన్నై కలకాలం
ఆమె మదిలో మెదలాలనుకున్నా
తాను కోకిలైతే
తానాలాపించె కుహుకుహు రాగాన్నై
తన గొంతులో పలకాలనుకున్నా
తాను రాయంఛలా కదలివస్తే
నే పూలబాటనై పరవశించాలనుకున్నా
కన్య కౌముదిని వెలుగులో
మల్లెనై వికసించాలనుకున్నా
నా స్వప్న సౌధాలు
సాకారం కావాలని
నా ప్రేమదేవతను వేడుకుంటున్నా !
nice, keep writing.
రిప్లయితొలగించండి