21, జూన్ 2012, గురువారం

తొలిసారి

గ్రీష్మ మాసంలో ఓ రోజు
మల్లె పందిరి క్రింద
చల్లని వెన్నెల్లో
మల్లె సువాసనల్ని ఆఘ్రానిస్తున్నా
ఇంతలో నీ గాజుల గలగలలు
నీ నవ్వుల కిలకిలలు వినిపించాయి
కానీ నీవు మాత్రం కనిపించలేదు
అలా నా మనసు పొరల్లో అలజడి రేపావు
మరోసారి
తొలకరి చినుకుల్లో నా మేని తడుస్తూ
మట్టి వాసనలతో
మనసు పులకరిస్తూన్న సమయంలో
నీ అందెల సవ్వడి వినిపించింది
నే చూసేసరికి
వడి వడి అడుగులతో
నాకు దూరమవుతూ నీవు
కానీ.....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి