24, జూన్ 2013, సోమవారం

"టీచర్ కథ - కమామిషు" పుస్తకం పై నా అభిప్రాయం

             "టీచర్  కథ - కమామిషు" అనే  పుస్తకాన్ని నేను ఈ మధ్య చదవడం జరిగింది.  ఈ పుస్తకం వివిధ రచయితల కథలు, వ్యాసాల సంకలనం.  ఇందులో చాసో, కాళిపట్నం రామారావు, బాపు, గిజుబాయి, చుక్కా రామయ్య వంటి గొప్ప  రచయితల, విద్యావేత్తల రచనలున్నాయి. స్థలాభావం వలన అందరి పేర్లను రాయలేకున్నాను.
         
            రచయితల పేర్లు వినగానే మనకు ఈ పుస్తకం కచ్చితంగా చదివితీరాలన్న అభిప్రాయం కలుగుతుంది.  అలాగే కచ్చితంగా చదివి తీరాల్సిన పుస్తకం.

             సంపాదకుడు ( కత్తి నరసింహారెడ్డి గారు ) రాసిన ముందుమాట చదివితే ఆయన ఈ సంకలనం తీసుకురావడానికి ప్రేరేపించిన పరిస్ఠితులు మనకు అర్ఠమవుతాయి.  ముందుమాటలో ఆయన పేర్కొన్న అంశాలన్నీ ప్రస్తుతం విద్యా వ్యవస్ఠను ప్రతిబింభిస్తాయి.  మచ్చుకు, కొన్ని పరిశీలిస్తే
         
              -  విద్యార్ఠులకు సూత్రాలు కంఠస్తాలు పెట్టించి పై క్లాసులకు                                 తరిమేశామా?  ఉన్నత విద్య కోసం విశ్వవిద్యాలయాల మెట్లెక్కె    యువతకు ఉన్నత విలువలు అక్కర లేదా?  యాసిడ్ విలువలు ఉంటే   సమాజం ఏమైపోవాలి?

             -  ఏ విద్యార్ఠి కూడా తన తండ్రి మ్యాథ్స్ ప్రొఫెసర్ అయిన అతడి మాట వినడు, తమ టీచర్స్ చెప్పిందే కరెక్ట్ అంటారు.  మరి ఉపాధ్యాయులకు అంతటి విలువనిస్తున్న విద్యార్ఠికి టీచర్స్ ఏమి విలువ ఇస్తున్నారు? బెత్తం పట్టుకొని పాఠం చెబుతున్నారు.

              ఇటువంటి వ్యాఖ్యలని మనం గమనిస్తే, సంపాదకుడు ఈ పుస్తక సంకలనం తీసుకురావడానికి ఏ అంశాలు ప్రేరణ కలిగించాయో మనకు సులభంగా అర్థమవుతుంది.

             అంతేకాక నరసింహా రెడ్డి గారు పేర్కొన్న నిజ జీవిత సంఘటనలు ఆయన్ని ఎంతగా కలచి వేశాయో మనం గ్రహించవచ్చు.

             ఈ పుస్తకం చదివిన ప్రతి ఉపాధ్యాయుడిలోను, తల్లిదండ్రులలోను కచ్చితంగా మార్పు వస్తుంది.  విద్యాభ్యాసం పట్ల మనం ఏర్పరచుకున్న నమ్మకాలు, అనుసరిస్తున్న వ్యూహాలు మార్చుకోవలసిన అవసరాన్ని గుర్తించగలుగుతాము.

              ఈ పుస్తకం చదివిన తరువాత నా మనస్సులో కలిగిన భావాలను తెలియపరచడం కోసం పుస్తకంలోని అన్ని కఠలు, వ్యాసాలు మీద నా అభిప్రాయాలు టపాలుగా రాయదలుచుకున్నాను.  వాటిని చదవగలరని మనవి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి