28, మే 2012, సోమవారం

బాల్యం



బాలలు
దుమ్ము ధూళి అన్న ఏహ్యభావం లేని వారు
వాటితో నిండిపోవడం
అందులోని ఆనందం
    ఆస్వాదించడం మాత్రమే తెలిసినవారు
అందరితో కలసి ఆడడం
    ఆనందించడం తప్ప
తర తమ భేధాలు తెలీనివారు
నిర్మలత్వంతో వెలిగే కళ్ళు
అమాయకత్వం నిండిన మోము
బురదనంటిన లేత వేళ్ళు
మట్టి తో నిండిన ఒళ్ళు
ఇంతటి చెత్త ఒంటి మీదున్న
మనసులు మాత్రం అతి శుభ్రం
అదే బాల్యం
పరిశుభ్రమైన దుస్తులు
అతిశుభ్రమైన ఒళ్ళు
అత్తరు సువాసనలు
కళ్ళలో అసూయ
మస్సులో ఈర్ష్య, ద్వేషం, పగలతో
పరమ కంపు కొడుతూన్న ...............................
పరిపక్వత చెందిన మనిషి

2 కామెంట్‌లు: